indian culture

indian culture
temple

Wednesday, September 21, 2011

మన భూమిని కాపాడుకొందాం



మన భూమిని కాపాడుకొందాం

ప్రకృతి ఎంత రమణీయమయినదో అంతే భయానకమయినది ,ఎప్పుడు చల్లని పిల్ల గాలులతో ,చిరు జల్లులతో ఉరకలెత్తిస్తుందో ,ఎప్పుడు వికృతంగా విరుచుకు పడుతుందో చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు .ఆకాశాన్ని అంతే సౌధాలు ,అంతరిక్షానికి చేరటానికి యంత్రాలు కనుగొన్న మానవాళి మేధస్సుకు ప్రకృతి వైపరిత్యలను కొనుగోనటం ఒక జవాబు లేని ప్రశ్నగా ,పరిష్కారం లేని సమస్యగానే మిగిలింది .భూమిని చీల్చి పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞలు ,భూకంపాలని తెలుసుకోవటం లో మాత్రం నిస్సహాయులు గానే మిగిలిపోయారు .100 సంవత్సరాలు బ్రతకటానికి ఔషధ శోధన లో ఉన్న శాస్త్రజ్ఞలు,భూకంపాల ధాటికి ప్రకృతి తల్లి ఒడిలో కన్నుమూస్తున్న ప్రాణాలని మాత్రం కాపాడలేకపోతుంది.నాగరికత లో ప్రపంచం లోనే తొలి స్తానం లో ఉన్న జపాన్ భూకంపాలని కనుగోనే టెక్నాలజీ నీ కనిపెట్టలేకపొతున్నారు .జ్ఞానం ,అలోచన శక్తి ఉన్న మానవాళికి అంతుపట్టని విషయాలు మన చుట్టూ ఉన్న పక్షులు ,జంతువులూ గ్రహించగలుగుతున్నాయి .భూకంపానికి కొద్ది నిమిషాల ముందు పారిపోవటానికి ప్రయత్నించే జంతువుల ప్రవర్తన మానవాళికి ఒక ఆశ్చర్యకరమైన విషయమే.ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఫలితం ఎ విధంగా ఉంటుందో చెప్పటం మాత్రం అసాధ్యం .
ఈ ప్రకృతి విలయ తాండవానికి ప్రధాన కారణం మానవాళికి ప్రకృతికి మధ్య ఏర్పడిన నాగరికత ,అభివృధి అనే అగాధం .మానవాళి నాగరికత ,అభివృధి పేరుతొ తన స్వలాభం కోసం ,తానూ కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు .అడవులని నరికి పట్టణాలని నిర్మిస్తూ ప్రకృతి ని పీల్చేస్తున్నాడు .ఇప్పటికే చేసిన నాశనానికి ,సునామి లు ,భూకంపాలు పేరొతో ,చాలా వరకు నష్టపోయాం .ఇప్పటికైన నాగరికత అనే ముసుగు లో నుండి బయటకి వచ్చి ప్రకృతిని నాశనం చేస్తున్న నిర్మాణాలని,అభివృధి నమూనాలని ,పరిశ్రమలని నిలిపివేయకపోతే ,ఋతువులతో సంభందం లేని అకాల వర్షాలు,వరదలకు ,ఉష్నోగ్రతలలో మార్పులకు ,ప్రకృతి చేసే విలయ తాండవానికి భారీ స్టాయిలో మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది .
మ న భూమిని కాపాడుకొందాం .

No comments:

Post a Comment